మరో రెండు సార్లు నేనే సీఎం… కేసీఆర్‌!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Sep 2019 10:45 AM GMT
మరో రెండు సార్లు నేనే సీఎం… కేసీఆర్‌!

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో మూడు టర్మ్‌లు రాష్ట్రంలో టీఆర్ఎస్‌దే అధికారమన్నారు. ఇప్పుడు తనకు 66 ఏళ్లని, ఇంకో పదేళ్లన్నా సీఎంగా చేయనా అని కేసీఆర్ స్పీకర్‌నుద్దేశించి వ్యాఖ్యానించడం విశేషం.

'కేసీఆర్ ఆరోగ్యం ఖతం అయిందట కదా.. అమెరికాకు పోతడంట కదా' అని ప్రచారం చేశారని సీఎం అన్నారు. 20 ఏళ్లుగా అదే ప్రచారం చేస్తున్నారని.. ఇన్ని ఏళ్లయినా తాను చావలేదని కేసీఆర్ అసెంబ్లీలో చమత్కరించారు.

కనిష్టంగా మరో మూడు టర్మ్‌లు టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఉంటుందని, తన ఆరోగ్యం బాగుందని, మరో రెండు టర్మ్‌లు తానే సీఎంగా ఉంటానని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్ని శాపాలు పెట్టినా గట్టిగానే ఉంటానని కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు.

అంతకుముందు యురేనియం తవ్వకాలపై తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. యురేనియం తవ్వకాల గురించి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవ్వరికీ ఏ విధమైన అనుమతి ఇవ్వలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

యురేనియం తవ్వకాలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు సభలో సోమవారం తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని... కేంద్ర ప్రభుత్వం దిగిరాని పక్షంలో కలిసి ఉద్యమిద్దామని చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు.

Next Story
Share it