విశాఖ బాధితులను పరామర్శించిన సీఎం జగన్
By సుభాష్ Published on 7 May 2020 2:48 PM ISTవిశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో రసాయన వాయువు లీకై తీవ్ర అస్వస్థతకు గురైన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 10 మంది మృతి చెందగా, వెయ్యి మంది వరకూ చికిత్సపొందుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కొద్దిసేపటి క్రితం కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నవారిని పరామర్శిస్తూ ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ లీకేజీ ఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని జగన్ విచారం వ్యక్తం చేశారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
కాఆ, ఈ విష వాయువు ఐదు కిలోమీటర్ల మేరకు వ్యాపించింది. పరిసర ప్రాంతాల్లో ఉన్న ఐదు గ్రామాల ఖాళీ చేయిస్తున్నారు పోలీసులు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిన్నారులు సైతం ఎక్కడికక్కడే పడిపోయారు. విశాఖలో భయానకరమైన వాతావరణం నెలకొంది. పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్, అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
[video width="640" height="352" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/05/WhatsApp-Video-2020-05-07-at-2.20.17-PM.mp4"][/video]