ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో ఇద్దరు మంత్రుల శాఖలకు కోత పెట్టేసింది. రెండు శాఖలను మార్పు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సర్కార్‌ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రి మోపిదేవి వెంకటరమణ వద్ద ఉన్న మార్కెటింగ్‌ శాఖను, అలాగే మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి వద్దనున్న ఆహార శుద్ది శాఖను వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబుకు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

మోపిదేవి వెంకటరమణ వద్ద ప్రస్తుతం మార్కెటింగ్‌ శాఖ, పశుసంవర్ధక శాఖ ఫిషరీష్‌ శాఖలున్నాయి. వాటిలో నుంచి మార్కెటింగ్‌ శాఖను తొలగించి వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకు అప్పగించారు. అలాగే మేకపాటి గౌతమ్‌ రెడ్డి వద్ద పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖలున్నాయి. వీటికి తోడు కొన్ని రోజుల కిందట సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖను కూడా చేర్చారు. ఇందులో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖను తీసుకెళ్లి కన్నబాబుకు అప్పగించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.