ఇప్పటికే కరోన మహమ్మారితో అగ్రరాజ్యం వకిణిపోతుండగా.. తాజాగా రాకాసి దోమల గుంపు ఆ దేశంపై దండెత్తింది. రాకాసి దోమల గుంపు వందల సంఖ్యలో పాడి జంతువుల్ని, వణ్య ప్రాణుల్ని బలితీసుకుంది. లూసియానాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత నెల 27న హరికేన్‌ లారా కారణంగా పెద్ద సంఖ్యలో రాకాసి దోమలు లూసియానాలోకి వచ్చిపడ్డాయి.

గుంపులుగా వచ్చి గేదెలు, ఆవులు, గుర్రాలు, జింకలపై దాడి చేశాయి. వాటి రక్తాన్ని పీల్చి చంపేశాయి. ఈ దాడిలో 400 పాడి జంతువులు, 30 జింకలు మృత్యువాతపడ్డాయి. దీంతో ఆ జంతువుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా లక్ష డాలర్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు హెలికాప్టర్ల సాయంతో దోమల మందును పిచికారీ చేశారు. దీంతో దోమల ఉధృతి కాస్త తగ్గింది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *