స్నేహం విలువ ఆయ‌న్ని చూసే నేర్చుకున్నాను - చిరంజీవి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2019 12:40 PM GMT
స్నేహం విలువ ఆయ‌న్ని చూసే నేర్చుకున్నాను - చిరంజీవి..!

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి తాజా సంచ‌ల‌నం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ సంచ‌ల‌న చిత్రం గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుని స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. తెలుగులోనే కాకుండా... త‌మిళ్, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో కూడా రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతోంది.

ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... 'సైరా' సినిమాలో గురువు పాత్ర‌ను ఎవ‌రు చేస్తే బాగుంటుందా..? అని ఆలోచిస్తున్న టైమ్ లో సురేంద‌ర్ రెడ్డి వ‌చ్చి అమితాబ్ చేస్తే బాగుంటుంది అన్నారు. ఆయ‌న‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయ‌న‌కి ఫోన్ చేసి 'సైరా న‌ర‌సింహారెడ్డి ' సినిమా క‌థ గురించి చెప్పి.. ఇందులో గురువు పాత్ర మీరు చేయాలి అన‌గానే... నేను న్యాయం చేస్తాన‌ని అనిపిస్తుందా..? అని అడిగారు.

నేను అవును అని చెప్ప‌గానే... మ‌రో ఆలోచ‌న లేకుండా త‌ప్ప‌కుండా చేస్తాన‌న్నారు. అయితే.. ఇక్క‌డ ఓ విష‌యం చెప్పాలి. అది ఏంటంటే... త‌ను ఇక్క‌డ‌కి సొంత ఖ‌ర్చుల‌తో వ‌చ్చారు. ఫ్రైవేట్ జెట్ పెట్టుకుని మ‌రీ వ‌చ్చారు. త‌న స్టాఫ్ ఖ‌ర్చులు అన్నీ ఆయ‌నే స్వ‌యంగా చూసుకున్నారు. మీరు మా అతిథి అని మేము చూసుకుంటాం అంటే వ‌ద్దు ఇది నా స్నేహితుడి కో్సం చేస్తున్నాను. నాకు ఆ సంతృప్తిని ఇవ్వండి అని చెప్పి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ సినిమాలో న‌టించారు. ఆయ‌న స్నేహానికి ఎంత విలువ ఇస్తారో అప్పుడు తెలిసింది. ఆయ‌న్ని చూసి ఎంతో నేర్చుకున్నాను అన్నారు చిరంజీవి.

Next Story
Share it