రోడ్డు ప్రమాదంలో సినీ దర్శకుడు దుర్మరణం
By సుభాష్ Published on 15 May 2020 6:32 PM IST
రోడ్డు ప్రమాదంలో తమిళ డైరెక్టర్ ఏవి అరుణ్ ప్రసాద్ దుర్మరణం చెందారు. ప్రముఖ దర్శకుడు శంకర్ వద్ద ఎన్నో సినిమాలకు అసిస్టెంట్‌గా పని చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని మెట్టు పాల్యం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సొంతూరు అన్నూరు నుంచి బైక్‌పై వెళ్తున్న అరుణ్ ప్రసాద్.. మెట్టుపాల్యం వద్ద లారీని క్రాస్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
అరుణ్ మృతి పట్ల దర్శకుడు శంకర్‌తో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అరుణ్ మృతిపై సోషల్ మీడయా ద్వారా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. అరుణ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడనే వార్త విని షాక్ గురయ్యామని పలువురు చెబుతున్నారు.
Next Story