భారత ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ గోస్వామి కన్నుమూత

By సుభాష్  Published on  30 April 2020 4:16 PM GMT
భారత ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ గోస్వామి కన్నుమూత

భారత ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ చునీ గోస్వామి (81) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కార్డియాక్‌ అరెస్ట్‌తో గురువారం సాయంత్రం కోల్‌కతాలో మరణించారు. 1957లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ కెరీర్‌ను ప్రారంభించారు. 1962లో జరిగిన ఏషియన్‌ క్రిడల్లో భారత ఫుట్‌బాల్‌ టీమ్‌లో గోస్వామి సారధ్యం వహించారు. ఈ సమయంలో భారత్‌ టీమ్‌ బంగారు పతాకాన్ని దక్కించుకుంది.

అలాగే 1964లో కూడా భారత్‌ టీమ్‌ రన్నరప్‌గా నిలిచింది. గోస్వామి ఫుట్‌బాల్‌లోనే కాకుండా మంచి క్రికెటర్‌ కూడా. 1966లె ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో గేరీ సాబర్స్‌ టీమ్‌ను ఓడించారు. ఆయన మృతిపై ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌, ఆయా ఫుట్‌బాల్‌ క్లబ్‌ల సభ్యులు సంతాపం ప్రకటించారు.

Next Story
Share it