'ఆ' నటుడితో పోల్చుకున్న ఆస్ట్రేలియన్‌ ఆటగాడు..

By Newsmeter.Network  Published on  25 Feb 2020 8:42 AM GMT
ఆ నటుడితో పోల్చుకున్న ఆస్ట్రేలియన్‌ ఆటగాడు..

ఆస్ట్రేలియా క్రికెటర్‌ క్రిస్‌లిన్‌.. అందరికీ షాక్‌ ఇచ్చాడు. తనను తాను ఓ పోర్న్‌ స్టార్‌తో పోల్చుకున్నాడు. ప్రస్తుతం ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌ పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో ఆడుతున్నాడు. పీఎస్ఎల్‌లో లాహోర్ ఖ‌లాండ‌ర్ త‌ర‌పున బరిలోకి దిగాడు. ఈ సందర్భంగా ఓ మ్యాచ్‌లో డగ్‌అవుట్‌లో బెన్‌డక్‌తో కలిసి మ్యాచ్‌ చూస్తున్న ఫోటోను ఓ నెటీజన్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. దాని కింద.. వీరిద్ద‌రూ డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ ప్ర‌ముఖ రెజ్ల‌ర్లు గోల్డ్ బెర్గ్‌, స్టోన్ కోల్డ్ మాదిరిగా క‌న్పిస్తున్నార‌ంటూ రాసుకొచ్చాడు.

ఈ ట్వీట్‌ ను చూసిన క్రిస్‌లిన్‌ తుంటరిగా సమాధానమిచ్చాడు. జానీ సిన్స్ అనే నీలిచిత్రాల న‌టుడిలాగా తాను ఉంటాన‌ని లిన్ ట్వీట్ చేశాడు. దీంతో.. స‌ద‌రు నెటిజ‌న్‌కు నోట‌మాట రాలేదు. లిన్ స‌మాధానం క్రికెట్ ఫ్యాన్స్‌ను బిత్త‌ర‌పోయేలా చేసింది. క్షణాల్లో ఆ ట్వీట్‌ వైరల్‌గా మారింది. వివిధ ర‌కాల కామెంట్లు, ఫొటోల‌తో నెటీజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరుపున నాలుగేళ్లలో నాలుగు వన్డే మ్యాచులు మాత్రమే ఆడిన లిన్‌.. 75 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు 44. 18 టీ20ల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌ 291 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. ఆ తరువాత వివిధ లీగుల్లో పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ తరుపున ఆడాడు. ఈ టోర్నీలో 41 మ్యాచ్‌లాడిన లిన్ 33.68 స‌గ‌టుతో 1280 ప‌ర‌గులు సాధించాడు. అత్య‌ధిక స్కోరు 93 కావ‌డం విశేషం. ఇందులో ప‌ది అర్ధ‌సెంచ‌రీలు ఉన్నాయి. అలాగే 140.66 స్ట్రైక్ రేట్‌తో త‌ను ప‌రుగులు సాధించాడు. ఇందులో 128 ఫోర్లు, 63 సిక్స‌ర్లు ఉన్నాయి.Next Story
Share it