పసివాళ్ల నుండి పండు ముసలి వరకు ఏ ఒక్కరూ వదలరు కదా చాక్లెట్..!
By సుభాష్ Published on 9 Feb 2020 11:04 AM GMTచాక్లెట్.. ఇది అందరికి ఇష్టమే. ఒక సమయం.. సందర్భం అంటూ లేకుండా గిఫ్ట్ గా ఇచ్చేది చాక్లెట్ మాత్రమే. ముందుగా గర్ల్ ఫ్రెండ్స్ కు బాయ్ ఫ్రెండ్స్ ఏం గిఫ్ట్ ఇవ్వాలో తొచక ముందుగా చాక్లెట్‌నే గిఫ్ట్ గా ఇస్తుంటారు. ఫిబ్రవరి 9న చాక్లెట్ డే. ఈ చాక్లెట్లు మనకు తెలియకుండానే మన ప్రేమలో ప్రముఖ పాత్ర పోషిస్తుంటాయి. ఈ రోజు చాక్లెట్ డే ను పురస్కరించుకుని అనేక రకాల డిజైన్ లతో కూడిన చాక్లెట్లను గిఫ్ట్ గా ఇస్తుంటారు. అంతేకాదు కొన్ని సంస్థలు మీరు ఇష్టపడే వ్యక్తి పేర్లను ప్రత్యేకంగా చాక్లెట్ల మీద ముద్రించేలా తయారు చేస్తుంటారు. గత శతాబ్దాలుగా ప్రజల ఆదరణ పొందిన పదార్థాలలో ఈ చాక్లెట్ ముందుగా ఉందనే చెప్పాలి. ఎన్నో రకాలుగా చాక్లెట్లు అందుబాటులో లభిస్తుంటాయి.
చాక్లెట్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరు ఎంతో ఇష్టంగా తింటుంటారు. ప్రస్తుతం అనేక రకాలుగా ఉన్న చాక్లెట్లలో డార్క్ చాక్లెట్ బెస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే డార్క్ చాక్లెట్‌లో అధిక పోషకాలు ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కోకో చెట్టు విత్తనం నుంచి తయారవుతుంది. యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఈ డార్క్ చాక్లెట్ వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా గుండె జబ్బులను సైతం దూరం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో కరిగే ఫైబర్ ఉండి, ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇవే కాకుండా ఇలా ఎన్నో రకాల చాక్లెట్లు అందుబాటులో ఉన్నాయి.
డార్క్ చాక్లెట్‌తో ఆరోగ్య ప్రయోజనాలు
వంద గ్రాముల డార్క్ చాక్లెట్ బార్ లో 70-85 శాతం కోకో కలిగి ఉంటుంది. 11 గ్రాముల పైబర్, 67శాతం ఆర్డీఐ కోసం ఇనుము, 58శాతం ఆర్డీఐ కోసం మెగ్నీషియం, 89 శాతం ఆర్డీఐ కోసం రాగి, 98 శాతం మాంగనీస్ ఉంటుంది. ఇందులో పోటాషియం, భాస్వరం, జింక్, సెలీనియం కూడా అధికంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ 600 కేలరీలు, చక్కరతో వస్తాయి. ఈ కారణంగా డార్క్ చాక్లెట్‌ని అధిక మంది తింటుంటారు. ఇక నాణ్యమైన చాక్లెట్‌లో మెగ్నీషియం, రాగి, మాంగనీస్, ఫైబర్ మరి కొన్ని ఖనిజాలు అధిక సంఖ్యలో లభిస్తాయి.
ఈ చాక్లెట్ బరువు తగ్గేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. మానసిక సమస్యలతో ఇబ్బందులు పడే వారికి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో కోకో ఎక్కువగా ఉండి, పాల పదార్థాలు తక్కువ గా ఉంటుంది.
వైట్ చాక్లెట్
ఈ చాక్లెట్‌లో చక్కర, పాలు, కోకో, బట్టర్ నుంచి ఈ వైట్ చాక్లెట్ తయారవుతుంది. వైట్ చాక్లెట్లు పూర్తి తెలుపు రంగులో కాకుండా దంతపు రంగులో ఉంటుంది.
సెమీ స్వీట్ చాక్లెట్
సెమీ స్వీట్ చాక్లెట్ కూడా ఒకరమైన డార్క్ చాక్లెట్. ఈ చాక్లెట్‌లో కోకో కేవలం 35 శాతం మాత్రమే ఉంటుంది. ఇది బిట్టర్ చాక్లెట్‌ల కన్నా కాస్త తీయ్యగాను ఉంటుంది.
కోకోలో అధిక శాతం యాంటీఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిదని అధ్యయనంలో తేలింది. డార్క్ చాక్లెట్ సేంద్రీయ సమ్మేళనాలతో చేయబడి ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం కోకో, డార్క్ చాక్లెట్‌లో ఇంతర పండ్ల కంటే ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్, పాలీఫెనాల్స్, ఫ్లేవనోల్స్ ఉన్నాయని తేలింది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న డార్క్ చాక్లెట్ వంటివి తినడం వల్ల అనేక రకాల క్యాన్సర్ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని చెబుతున్ననారు. అలాగే వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గించుకోవచ్చు.
ఈ డార్క్ చాక్లెట్‌లో ప్లేవనాయిడ్లు అధిక సంఖ్యలో ఉన్నందున రక్తనాళాల పనితీరు మెరుగు పడుతుంది. అలాగే రక్తపోటును తగ్గించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కోకో ఆధారిత ఉత్పత్తులను తీసుకోవడం సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటులో సానుకూల మార్పులకు దారి తీస్తుందని పరిశోధనలో తేలింది.