సెనైడ్‌ ప్రయోగం.. భార్యను హత్య చేసిన భర్త.!

By అంజి  Published on  3 Feb 2020 7:19 AM GMT
సెనైడ్‌ ప్రయోగం.. భార్యను హత్య చేసిన భర్త.!

చిత్తూరు జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్యను ఎవరికీ అనుమానం రాకుండా భర్త హత్య చేసిన ఘటన సోమవారం జరిగింది. భార్యకు సెనైడ్‌ ఇచ్చి చంపిన అమానుష ఘటన మదనపల్లిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత కొంత కాలంగా భార్య ఆమని విటమిన్‌-బి లోపంతో బాధపడుతోంది. దీంతో భార్యపై భర్త రవిచైతన్య సైనెడ్‌ ప్రయోగం చేసి చంపేశాడు. గత నెల 27న వివాహిత ఆమని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన పై ఆమని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వారం రోజుల్లోనే ఆమని అనుమానస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. భర్త రవిచైతన్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిజాల నిగ్గు తేల్చారు. ఆమని వేసుకునే టాబ్లెట్లలో సైనెడ్‌ నింపినట్లు భర్త రవి చైతన్య ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. భర్త రవి చైతన్య బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మదనపల్లె బ్రాంచ్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. తన వివాహేతర సంబంధానికి భార్య ఆమని అడ్డుస్తుందన్న కోపంతోనే చంపినట్లు తెలుస్తోంది.

Next Story
Share it