'నాకు కరోనా లేదు' అంటున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్

By రాణి  Published on  5 March 2020 9:46 AM GMT
నాకు కరోనా లేదు అంటున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్

హైదరాబాద్ లో ఇటీవలే ఇతర దేశం నుంచి వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు కరోనా నిర్థారణవ్వగా అతడికి గాంధీలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అతడు నివాసమున్న మహేంద్ర హిల్స్ లో ప్రజలను అప్రమత్తం చేసి, ఆ ప్రాంతంలో ఉన్న స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఇంకా గాంధీలో మరికొంత మంది కరోనా రిపోర్టులు రావాల్సి ఉంది.

కాగా..చిత్తూరు జిల్లాలో ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ''నాకు కరోనా లేదు'' అని వాపోతున్నాడు. చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం నెరబైలుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కుండ్ల గిరిధర్ బెంగళూరులో పనిచేస్తున్నాడు. ఇటీవల అతడు ప్రాజెక్టు పనిమీద ఆస్ర్టేలియా వెళ్లొచ్చాడు. అయితే..ఇంతలోనే గిరిధర్ కనపడటం లేదంటూ ప్రచారం జరగడంతో అధికారులు అతడి కోసం గాలించడం మొదలు పెట్టారు. తాజాగా..ఈ విషయంపై గిరిధర్ స్పందించాడు. బెంగళూరు విమానాశ్రయంలో దిగిన తర్వాత తనకు అన్ని టెస్టులు చేశారని, తనకు కరోనా లేదని నిర్థారణ అయిందని చెప్పుకొచ్చాడు. బెంగళూరులోని తమ సంస్థ తరపున ఆస్ర్టేలియాలో కొంతకాలంగా పనిచేస్తున్న తాను..రెండువారాలు ఆఫీసుకు సెలవులివ్వడంతో ఇండియాకు వచ్చినట్లు తెలిపారు. బెంగళూరు విమానాశ్రయం వరకూ వచ్చిన అతను..కనిపించకుండా పోయాడని వచ్చిన పుకార్లన్నీ అబద్ధమని ఖండించాడు. అలాగే కనిపించడం లేదన్న సాకుతో తన వ్యక్తిగత విషయాలను ప్రభుత్వాధికారులు సేకరించడం పై గిరిధర్ అసహనం వ్యక్తం చేశారు.

Next Story