చిత్తూరులో 21 నాటు తుపాకుల స్వాధీనం

By సుభాష్  Published on  22 Jun 2020 2:04 AM GMT
చిత్తూరులో 21 నాటు తుపాకుల స్వాధీనం

ఏపీలోని చిత్తూరు జిల్లాలో నాటు తుపాకులు కలకలం రేపాయి. జిల్లాలోని మదనపల్లె మండలంలో పోలీసులు 21 నాటు తుపాకులను గుర్తించారు. కోళ్ల జైలు, మాలెపాడులో మదనపల్లెలో పోలీసులు ఈ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. తుపాకులను స్వాధీనం చేసుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎందు కోసం తీసుకొచ్చారనే దానిపై పోసులు దర్యాప్తు చేపడుతున్నారు. గ్రామాల్లో పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా ఈ తుపాకులు పట్టబడ్డాయి. ఇంకేమైనా నాటు తుపాకులుంటే పది రోజుల్లోగా స్వాధీనం చేయాలని, లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Next Story
Share it