చిత్తూరు జిల్లా: గంగవరం మండలం మామడుగు వద్ద ఘోర ప్రమాదం  జరిగింది.  కారులో మంటలు వచ్చి పూర్తిగా దగ్దమైంది.  అందులో ఉన్న ఐదుగురు మృతి చెందారు. పోలీసుల రిపోర్ట్ ప్రకారం తిరుపతి కి చెందిన ఆరుగురు బెంగళూరు నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోని పలమనేర్ కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
న్యూస్ మీటర్ కు అందిన సమాచారం ప్రకారం.. కారు నడుపుతున్న విష్ణు వేగాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు.  కారు 10 అడుగుల లోతు గుంటలో పడిపోయింది.  విష్ణు మాత్రం కాలిన గాయాలతో బతికి బయటపడ్డాడు. మిగితా ఐదుగురూ మంటలకు ఆహుతి అయ్యారు. విష్ణు ను పోలీసులు ఆసుపత్రి కి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని  చెబుతున్నారు.
చనిపోయినవారిలో విష్ణు భార్య, కొడుకు, కూతురు, చెల్లెలు, మేనల్లుడూ ఉన్నారు. మృతులు జాహ్నవి, కళ, భానుతేజ, పవన్రామ్, సాయి ఆశ్రిత. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.