టీటీడీ నిర్ణయంపై చిత్తూరు జిల్లా ప్రజలు హర్షం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Nov 2019 7:39 AM GMT
టీటీడీ నిర్ణయంపై చిత్తూరు జిల్లా ప్రజలు హర్షం

చిత్తూరు: టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న చిత్తూరు జిల్లా వాసులుకు 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని సంకల్పించింది. ఈ మేరకు టీటీడీలోని జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఉద్యోగాల భర్తిలో ఈ రిజర్వేషన్‌ అమలు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులు భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం బోర్డు సమావేశంలో ఈ కీలక ప్రతిపాదన చేశారు.

టీటీడీ పాలనమండలి తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం ప్రభుత్వ అనుమతులకు పంపింది. అయితే దీనిని ప్రభుత్వం ఆమోదిస్తే.. ఇప్పటి నుంచి వెలువడే ఉద్యోగాల భర్తీలో అధిక భాగం జిల్లా వాసులకు దక్కే అవకాశం ఉంది. తాజా నిర్ణయంపై చిత్తూరు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

Next Story
Share it