టాలీవుడ్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేసీఆర్‌.. అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్‌ సిటీ

By సుభాష్  Published on  8 Nov 2020 2:51 AM GMT
టాలీవుడ్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేసీఆర్‌.. అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్‌ సిటీ

కరోనా మహమ్మారి ప్రభావం అంతా కాదు. సామాన్యుడి వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారులపై తీవ్రమైన దెబ్బకొట్టింది. ఇక కరోనా ఎఫెక్ట్‌తో చిత్ర పరిశ్రమ సైతం భారీగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమను ఆదుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. త్వరలోనే సినిమాథియేటర్లను తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శనివారం సీఎం కేసీఆర్‌ను మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జునలు కలిసి వరద బాధితుల కోసం ప్రకటించిన విరాళాల చెక్కులను అందించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ సినీ పరిశ్రమ గురించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. కరోనా ప్రభావంతో భారీగా నష్టపోయిన సినీ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం తనవంతు సాయం చేస్తుందని చెప్పారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సినిమా షూటింగ్‌లు ప్రారంభించాలని ఆయన కోరారు. హైదరాబాద్‌ సినీ శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీని నిర్మిస్తామిన హామీ ఇచ్చారు. ఫిల్మ్‌ సిటీ కోసం 1500-2000 ఎకరాల స్థలం కేటాయిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇక కేసీఆర్‌ ఆదేశాలతో త్వరలో బల్గేరియా ఫిల్మ్ సిటీని పరిశీలించానున్నారు.

Next Story