‘సైరా న‌ర‌సింహారెడ్డి ‘సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ఈసారి ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీతో అభిమానుల‌ను అల‌రించేందుకు కొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు. బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వ‌లో రూపొందే ఈ సినిమా న‌వంబ‌ర్ నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. కొర‌టాల సినిమాలు ఎలా ఉంటాయో తెలిసిందే. సామాజిక సందేశంతో పాటు మంచి పాట‌లు, ఫైట్స్ ఉంటాయి.

ఈ సినిమా కూడా అలాగే ఉంటుంద‌ట. అయితే… క‌థ ఏంటి..? చిరు క్యారెక్ట‌ర్ ఏంటి..? అనేది అఫియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌లేదు. ఇదిలా ఉంటే… ఫ్యాన్స్ కి ఈ సినిమాతో స‌ర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇవ్వ‌నున్నార‌ట‌. ఇంత‌కీ.. విష‌యం ఏంటంటే… ఈ సినిమాలో చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒక సోషల్ మెసేజ్ నేపథ్యంలో ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో చరణ్ పాత్రకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు.

చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్ గురించి చర‌ణ్ కి, చిరుకి కొర‌టాల చెప్ప‌గానే… సెకండ్ థాట్ లేకుండా వెంట‌నే ఓకే చెప్పార‌ట‌. చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ కంప్లీట్ అయిన త‌ర్వాత ఈ సినిమా షూటింగ్ లో పాల్గొటాడ‌ట‌. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మెగా అభిమానులు చాలా హ్యపీగా ఫీల‌వుతున్నారు. సో… ఈ సినిమా చిరు అభిమానుల‌కు నిజంగా పండ‌గే..!

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.