మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేష‌న్ ‘సైరా న‌ర‌సింహారెడ్డి’. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ఈ సంచ‌ల‌న చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. సామాన్యుల నుంచి అసామాన్యుల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రిని ‘ సైరా’ థియేటర్లకు రప్పిస్తుంది. ప్ర‌తి ఒక్క‌రు చూడాల్సిన సినిమా అంటూ ‘సైరా’ టీమ్ పై ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Chiru Charan meeting AP CM YS Jagan

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే… మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రేపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్. జ‌గ‌న్ ని క‌ల‌వ‌నున్నార‌ని స‌మాచారం. ఇంత‌కీ విష‌యం ఏంటంటే… ‘సైరా’ సినిమాకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో స్పెష‌ల్ షోస్ వేసుకోవడానికి ప‌ర్మిష‌న్ ఇచ్చినందుకు గాను కృత‌జ్ఞ‌త‌లు చెప్పి.. ‘సైరా’ సినిమాని చూడ‌మ‌ని జ‌గ‌న్ ని కోరేందుకు అని తెలిసింది. సైరా సినిమాకి తెలంగాణ‌లో 5 షోస్ వేసుకోవ‌డానికి ప‌ర్మిష‌న్ ఇస్తే… ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 6 షోస్ వేసుకోవ‌డానికి అనుమ‌తి మంజూరు చేయ‌డం ద్వారా ‘సైరా’కి జ‌గ‌న్ ఎంత‌గానో స‌హ‌క‌రించారు.

Chiru Charan meeting AP CM YS Jagan

ఇటీవ‌ల తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ సైరా సినిమాని చూసి… ప్ర‌తి ఒక్క‌రు చూడాల్సిన సినిమా సైరా. ఈ సినిమా గురించి చెప్ప‌డానికి మాట‌లు లేవు అంటూ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ… చిరంజీవిని ఎంత‌గానో అభినందించారు. మ‌రి.. జ‌గ‌న్… చిరు, చ‌ర‌ణ్ ల కోరిక మేర‌కు ‘సైరా’ సినిమాని చూస్తే… ఏ విధంగా స్పందిస్తారో అనేది ఆస‌క్తిగా మారింది.

Chiru Charan meeting AP CM YS Jagan

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.