సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జునలతో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి,  సినీ కళాకారుల సంక్షేమానికి ప్రణాళికలు రూపొందించడం, తదితర అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.  హైదరాబాద్‌లో ఇండస్ట్రీని బలోపేతం చేయడంతో పాటు పుణె ఫిల్మ్‌ తరహా ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవలే మంత్రి తలసానితో చిరంజీవి, నాగార్జున సమావేశమైన విషయం తెలిసిందే.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.