అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మెగస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు.  చిరంజీవి దంపతులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు సాదరంగా ఆహ్వానించారు.   సీఎం వైఎస్ జగన్ నివాసంలో  ‘సైరా’ చిరంజీవి జగన్ ను కలుసుకున్నారు. ‘సైరా నరసింహ రెడ్డి’ మూవీని చూడాలని సీఎం జగన్ ను చిరంజీవి కోరినట్లు తెలుస్తోంది. ఏపీలో ‘సైరా నరసింహారెడ్డి’ అదనపు షోలకు  జగన్ అనుమతి ఇచ్చారు. అయితే..ముందుగా అనుకున్నట్లు.. రామ్ చరణ్ అమరావతికి   రాలేదు. చిరంజీవి , సీఎం జగన్ ల భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.