హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. సతీమణి సురేఖతో కలిసి ఆయన గన్నవరం వచ్చారు. అభిమానులు చిరంజీవికి ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో చిరంజీవి విజయవాడ బయల్దేరారు. కాసేపట్లో సీఎం జగన్‌ను చిరంజీవి దంపతులు మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు.