చిరంజీవి అంటే అందుకే నాకు అంత ఇష్టం: డా.టి.సుబ్బిరామిరెడ్డి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Oct 2019 3:16 PM GMT
చిరంజీవి అంటే అందుకే నాకు అంత ఇష్టం: డా.టి.సుబ్బిరామిరెడ్డి

  • సైరా'తో భారతదేశానికి తన సత్తా ఏమిటో చిరంజీవి చాటి చెప్పారు
  • ధైర్యమంటే రామ్‌ చరణ్‌దే
  • ‘సైరా’ ఆత్మీయ సత్కార సభలో కళాబంధు డా.టి. సుబ్బిరామిరెడ్డి

కళలను, కళాకారులను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఆరు దశాబ్దాల సినీ,వ్యాపార, రాజకీయ జీవితంలో సినీ కళాకారులతో ఎంతో సన్నిహితంగా ఉన్నారు. ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహిస్తూ ‘కళాబంధు’గా కీర్తించబడ్డారు. ఆయనే ప్రముఖ సినీ నిర్మాత,వ్యాపారవేత్త, రాజకీయవేత్త డా.టి. సుబ్బిరామిరెడ్డి. ఇటీవల విడుదలైన మెగాస్టార్ చిరంజీవి చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్‌ను సుబ్బిరామిరెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు. ‘సైరా’ బృందాన్ని సన్మానించి ..అభినందించారు సుబ్బిరామిరెడ్డి.

ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ..‘‘150 చిత్రాలు చేసిన చిరంజీవికి అవన్నీ ఒక ఎత్తయితే 151వ సినిమా ‘సైరా’ మరో ఎత్తు. బ్రిటీషువారిని గడగడలాడించిన స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను తీసుకుని తన సత్తా ఏంటో భారతదేశానికి చిరంజీవి చాటిచెప్పారు. ఇలాంటి కథను ఎంచుకోవడమే పెద్ద సాహసం. చిరంజీవి అలాంటి సాహసం చేసి సక్సెస్ అయ్యారు. ఇలాంటి భారీ సినిమాను రామ్ చరణ్ లాంటి కుర్రాడు నిర్మించాడంటే ఆశ్చర్యం కలుగకమానదు. పిల్లలకు మనం నేర్పించాలి. కానీ రామ్ చరణ్ చిన్న వయసులోనే సింపుల్, హంబుల్, డౌన్ టు ఎర్త్, అఫెక్షనేట్, ఫినామినల్ పర్సన్. అటువంటి రామ్ చరణ్ ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాడంటే అన్‌బిలీవబుల్.. అంటూ ... చరణ్‌పై పొగడ్తల వర్షం కురిపించారు సుబ్బిరామిరెడ్డి.

Subbirami Reddy Felicitates Sya raa Team

తమన్నా మాట్లాడుతూ..‘‘సుబ్బిరామిరెడ్డి గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే.. మా డైరెక్టర్ సురేందర్‌రెడ్డి గారిని గెడ్డం లేకుండా క్లీన్ షేవ్‌లో చూసే అవకాశం కల్పించారు. ఇలా అందరినీ ఈ వేదికపై చూడడం ఎంతో ఆనందంగా ఉంది. మంచి సినిమాలకు సుబ్బిరామిరెడ్డి గారు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్‌గా ట్రీట్ చేస్తారు. ఈ రోజు నేను ఇక్కడ నిల్చున్నానంటే సుబ్బిరామిరెడ్డి గారే కారణం. సో థ్యాంక్యూ సోమచ్ టు సుబ్బిరామిరెడ్డి గారు. ఈ సినిమాలో నటించే గొప్ప అదృష్టాన్ని కల్పించిన సురేందర్‌రెడ్డి, రామ్ చరణ్, చిరంజీవి గారికి చాలా పెద్ద థ్యాంక్స్.’’ అన్నారు.

Subbirami Reddy Felicitates Sya raa Team

డైరెక్టర్ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘నేను ఏ ముహూర్తాన చరణ్‌తో ‘ధృవ’ సినిమా తీశానో కానీ, నన్ను ఒక మంచి సబ్జెక్ట్, టీమ్ మధ్య నిలబెట్టాడు. థ్యాంక్యూ చరణ్. నేను ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం చిరంజీవిగారు ఇచ్చిన సపోర్ట్, ధైర్యమే. మెగాస్టార్ ప్రోత్సాహమే నన్ను ఇంతదూరం తీసుకొచ్చింది.’’ అన్నారు.

Subbirami Reddy Felicitates Sya raa Team

రామ్ చరణ్ మాట్లాడుతూ..‘‘సుబ్బిరామిరెడ్డి గారి ఫంక్షన్ లేకపోతే ఆ సంవత్సరం మాకు ఏదో వెలితిగా ఉంటుంది. తమన్నా పక్కన మెరిసిపోతూ ఆయన డాషింగ్‌గా కనిపిస్తున్నారు. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్యూ డాడీ. నేనేదో ఆయకు ప్రొడ్యూసర్ అని అందరూ అంటున్నారు. కానీ, నేను అలా భావించట్లేదు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ థ్యాంక్యూ.’’ అన్నారు.

Subbirami Reddy Felicitates Sya raa Team

Next Story