చిరంజీవితో పోటీప‌డుతున్న గోపీచంద్.. ఏంటా ధైర్యం..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Sep 2019 11:35 AM GMT
చిరంజీవితో పోటీప‌డుతున్న గోపీచంద్.. ఏంటా ధైర్యం..?

యువ హీరో గోపీచంద్ ఇటీవ‌ల‌ న‌టించిన సౌఖ్యం, గౌత‌మ్ నంద‌, ఆక్సిజ‌న్, ఆర‌డుగుల బుల్లెట్, పంతం... త‌దిత‌ర‌ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈసారి ఎలాగైనా స‌రే... విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో చాణ‌క్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. అయితే... స‌క్స‌స్ కావాల్సిన ఈ టైమ్ లో గోపీచంద్ పెద్ద సాహ‌స‌మే చేస్తున్నాడు.

ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే...మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సంచ‌ల‌న చిత్రం సైరా న‌రసింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ భారీ చిత్రం గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. చిరు మూవీ వ‌స్తుంద‌ని చాలా సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకున్నారు కానీ.. గోపీచంద్ మాత్రం సైరా వ‌చ్చిన మూడు రోజుల‌కు అన‌గా అక్టోబ‌ర్ 5న చాణ‌క్య సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు ఎనౌన్స్ చేసాడు.

గోపీచంద్ చాణ‌క్య రిలీజ్ అక్టోబ‌ర్ 5న అని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఇటు ఇండ‌స్ట్రీలోను, అటు ఆడియ‌న్స్ లోను ఏంటి.. గోపీచంద్ ధైర్యం.? చాణక్య మూవీ స్క్రిప్ట్ లో అంత దమ్ముందా.? సైరా మూవీకి పోటీగా మూడు రోజుల తేడాతో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు ? గోపీచంద్ ఎందుకింత సాహ‌సం చేస్తున్నారు అని చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి.. ఎనౌన్స్ చేసిన‌ట్టుగా అక్టోబ‌ర్ 5న చాణ‌క్య చిత్రాన్ని రిలీజ్ చేస్తారా..? లేక ఆఖ‌రి నిమిషంలో వాయిదా వేస్తారా..? చూడాలి.

Next Story
Share it