సచిన్‌కి మెగాస్టార్ శుభాకాంక్షలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 April 2020 1:11 PM GMT
సచిన్‌కి మెగాస్టార్ శుభాకాంక్షలు

స‌చిన్ టెండూల్క‌ర్ క్రికెట్ ప్రేమికుల‌కు పరిచ‌యం అక్క‌ర‌లేని పేరు. అభిమానులంతా 'గాడ్ ది క్రికెట్' గా స‌చిన్‌ను పిలుచుకుంటారు. స‌చిన్ క్రికెట్ ఆడే రోజుల్లో స‌చిన్ కోస‌మే మ్యాచ్ చూసేవారు.. స‌చిన్ ఔట్ కాగానే టీవీలు ఆఫ్ చేసే వారు. ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచుల్లో అయితే.. స‌చిన్ ఔటైతే.. అభిమానులు టీవీల‌ను ప‌గ‌ల‌గొట్టిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి.

ఇక క్రికట్‌లో దాదాపు అన్ని రికార్డులు స‌చిన్ పేరు మీద‌నే ఉన్నాయి. వ‌న్డే, టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా, అత్య‌ధిక మ్యాచులు ఆడిన రికార్డు, ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో తొలిసారి ద్విశ‌త‌కం సాధించిన రికార్డుల‌తో పాటు ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రికి సాధ్యం కానీ శ‌త శ‌త‌కాల రికార్డు స‌చిన్ పేరు మీద ఉన్నాయి.

శుక్ర‌వారం ఈ భార‌త మాజీ దిగ్గ‌జ ఆట‌గాడు 47వ వ‌సంతోకి అడుగుపెట్టాడు‌. 24ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అటుపోట్లు ఎదుర్కొని ఆట‌కే వ‌న్నె తెచ్చాడు సచిన్‌. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ కార‌ణంగా పుట్టిన రోజు వేడుక‌ల‌కు దూరంగా ఉంటున్న‌ట్లు చెప్పారు. ఇక సోష‌ల్ మీడియాలో స‌చిన్‌కు శుభాంక్ష‌లు వెల్లువెత్తాయి.

మెగాస్టార్ చిరంజీవి కూడా సచిన్‌కు ట్విటర్ ద్వారా విషెస్ తెలియజేశారు. "క్రికెట్ దేవుడు, ఒకే ఒక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. భారతీయలకు నువ్వు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తావు. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడ " ని చిరంజీవి ట్వీట్ చేశారు. కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్‌కు చిరంజీవి, నాగార్జునతోపాటు సచిన్ కూడా సహ భాగస్వామి అనే సంగతి తెలిసిందే.Next Story