నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలి.. ప్రభుత్వానికి నర్స్ విజ్ఞప్తి
By Newsmeter.Network
కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా బాధితులు చైనాలో ఎక్కువగా ఉన్నారు. దీంతో అక్కడి డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది అవిశ్రాంతంగా విధులు నిర్వహిస్తూ సేవలు చేస్తున్నారు. ఇళ్లకు కూడా వెళ్లకుండా ఆస్పత్రిలోనే ఉంటూ సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కరోనా బాధితులకు సేవలు చేస్తున్న ఓ నర్సు ఓ కోరిక కోరింది. తనకు ఓ భాయ్ ఫ్రెండ్‌ను చూసి పెట్టమని ఏకంగా అక్కడి ప్రభుత్వానికే విజ్ఞప్తి చేసింది.
ఒకవైపు డ్యూటీ.. మరోవైపు కరోనా రోగులకు సేవలు ఈ రెండింటి నడుమ టియాన్ ఫాంగ్‌ఫాంగ్ (30) అనే నర్సు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నేను నా భాయ్ ఫ్రెండ్‌ను వెతుక్కునే పనిలో ఉండగా.. కరోనా మహమ్మారి బెడద వచ్చిపడింది. నేను నర్సును కనుక నా డ్యూటీని అంకిత భావంతో పనిచేస్తున్నాను. ఇంటికి కూడా వెళ్లేందుకు సమయం చిక్కడం లేదు. ఇక నా భాయ్ ప్రెండ్ ను వెతుకునే ప్రయత్నాలు ఆగిపోయాయి. ఇందుకు ప్రభుత్వాన్ని సాయం చేయమని కోరింది.
అయితే.. ఇప్పడికిప్పుడు భాయ్‌ప్రెండ్ ఏం వద్దట.. ఈ కరోనా మహమ్మారిని అంతం చేశాకే తన కోరికను నెరవేర్చాలని అంటోంది. ఈ మేరకు మెసేజ్ తో కూడిన ఓ లెటర్ చూపిస్తూ.. హ్యాజ్‌మ్యాట్ సూట్‌లో, కళ్లకు గాగుల్స్ పెట్టుకొని ఆమె ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ‘‘కరోనా గండం తప్పుతుంది. మంచిరోజులు వస్తాయనే ఆశాభావాన్ని ప్రజల్లో వ్యాపింపజేసేందుకే నాకు ఆజానుబాహుడైన బాయ్‌ఫ్రెండ్‌ను వెదకాలని ప్రభుత్వాన్ని కోరాను’’ అని టియాన్ చెబుతోంది.