చైనాలో వీగర్ ముస్లింల సంగతేంటీ..? ఇమ్రాన్‌కు అమెరికా సూటి ప్రశ్న

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Sep 2019 2:37 PM GMT
చైనాలో వీగర్ ముస్లింల సంగతేంటీ..? ఇమ్రాన్‌కు అమెరికా సూటి ప్రశ్న

న్యూయార్క్‌: కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని గగ్గోలు పెట్టే పాక్‌కు అమెరికా ఝలక్ ఇచ్చింది. చైనాలో వీగర్ ముస్లింల పరిస్థితి కనిపించడం లేదా అని ఇమ్రాన్‌ను అమెరికా దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అసిస్టెంట్‌ సెక్రటరీ అలైస్‌ వెల్స్‌ ప్రశ్నించాడు. దాదాపు 10 లక్షల మంది ముస్లింలు చైనా ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుందన్నారు.

Image result for uighur muslims china

దీనిపై మీరెందుకు మౌనంగా ఉన్నారని పాక్‌ను వెల్స్‌ ప్రశ్నించారు. గత వారం ఓ ప్రెస్‌ మీట్‌లో ఇమ్రాన్‌ను చైనాలోని ముస్లింల పరిస్థితి ఏంటని అడగ్గా.."మేం ప్రత్యేకమైన మిత్రులం అది మేము కూర్చుని చర్చించుకుంటాం "అన్నారు.

Image result for imran jinping

కశ్మీర్‌లోని ముస్లింల పట్ల ఒకలా..చైనాలోని ముస్లింల పట్ల పాక్‌ వ్యవహారించడాన్ని అమెరికా తప్పుబట్టింది. చైనా జిన్‌జియాంగ్ ప్రాంతంలోని ముస్లింలే ఎక్కువ నిర్బంధంలో ఉన్నారని వేల్స్ చెప్పారు. చైనా ప్రభుత్వం వెల్ నెస్ సెంటర్లు తెరిచి వారిని హింసిస్తుందన్నారు. దీన్ని యూఎన్‌ఓతోపాటు 30 దేశాలు ఖండించాయి. చైనా మాత్రం అలాంటిదేమీ లేదంటోంది.

Image result for uighur muslims china

Next Story