క‌రోనాతో కొట్టుమిట్టాడుతున్న చైనాలో.. మ‌రో భ‌యంక‌ర‌మైన వైర‌స్‌..!

By Newsmeter.Network  Published on  2 Feb 2020 10:16 AM GMT
క‌రోనాతో కొట్టుమిట్టాడుతున్న చైనాలో.. మ‌రో భ‌యంక‌ర‌మైన వైర‌స్‌..!

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ వైరస్‌ బారీన పడి ఇప్పటికే 260 మందికి పైగా మృతి చెందగా.. వేల సంఖ్యలో వైరస్‌ భాధితులు ఉన్నారు. కాగా ఈ వైరస్ కు ఇంకా మందును కనిపెట్టలేదు. కరోనా వైరస్‌తో ఓ వైపు భాదపడుతుంటే.. తాజాగా మరో వైరస్ చైనాలో వెలుగు చూసింది. బర్డ్‌ ఫ్లూ ఆనవాళ్లను గుర్తించినట్లు ఆ దేశ వ్యవసాయశాఖ మంత్రి వెల్లడించారు.

కరోనాకు కేంద్రంగా ఉన్న హుబి ప్రావిన్సు దక్షిణాన ఉన్న హునన్‌ ప్రావిన్సులో బర్డ్‌ ఫ్లూకు కారణమయ్యే హెచ్‌5ఎన్‌1 వైరస్‌ గుర్తించినట్లు చెప్పారు. షయోయాంగ్‌ నగరం శివారులోని ఓ కోళ్లఫారమ్‌లో ఈ వైరస్ ధాటికి ఇప్పటి వరకు 4500 కోళ్లు మృత్యువాత పడినట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని మిగతా వాటిని వేరుచేశారు. ఫ్లూ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా ఈ వైరస్‌ వల్ల ఇప్పటివరకు మనుషులెవరూ ప్రభావితం కాలేదు.

Next Story