వ్యాక్సిన్‌ కొనుగోలు చేయం..చైనాకు షాకిచ్చిన బ్రెజిల్

By సుభాష్  Published on  22 Oct 2020 9:03 AM GMT
వ్యాక్సిన్‌ కొనుగోలు చేయం..చైనాకు షాకిచ్చిన బ్రెజిల్

చైనాకు బ్రెజల్‌ షాకిచ్చింది. చైనా రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ను తమ ప్రభుత్వం కొనుగోలు చేయదని బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో స్పష్టం చేశారు. చైనా సినోవిక్‌ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయవద్దని ఆయన మద్దతుదారులు కొంత మంది సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన బోల్సోనారో చైనా వ్యాక్సిన్‌ను తమ దేశం కొనబోదని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా, ఆరోగ్య శాఖ మంత్రి ఎడ్వర్డో పజుఎల్లో రాష్ట్ర గవర్నర్‌తో జరిగిన సమావేశంలో సినోవాక్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఇమ్యునైజేషన్‌ కార్యక్రమంలో చేర్చడానికి మంత్రిత్వశాఖ కొనుగోలు చేస్తుందని చెప్పారు. దీనికి అదనంగా కొన్ని వ్యాక్సిన్లను ఆస్టాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేశాయని చెప్పారు. సావో పాలో స్టేట్‌ బయోమెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌, బుటాంటన్‌ ఇన్సిట్యూట్‌, సివోవాక్ వ్యాక్సిన్‌ను పరీక్షిస్తోందని అన్నారు.

జనవరిలో కరోనా టీకా వేయడం ప్రారంభిస్తాం

కాగా, జనవరిలో కరోనా టీకా వేయడం ప్రారంభిస్తామని గవర్నర్‌ జోడో డోరియా అన్నారు. దాని కోసం ఈ ఏడాది చివరి నాటికి హెల్త్‌ రెగ్యులేటర్‌ ఆమోదం పొందాలని భావిస్తున్నట్లు చెప్పారు. 46 మిలియన్‌ మోతాదుల సివోవాక్‌ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయానికి ఫెడరల్‌ ప్రభుత్వం అంగీకరించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమావేశంలో గవర్నర్‌ అన్నారు. కరోనావాక్‌ అని పిలిచే వ్యాక్సిన్‌ను 230 మిలియన్ల జనాభా కలిగిన జాతీయ టీకా కార్యక్రమంలో చేర్చడం సివోవాక్‌ కు మంచి గుర్తింపు తీసుకువస్తుందన్నారు. బ్రెజిల్‌ సర్కార్‌ ఇప్పటికే యూకే వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి రియో డీ జనేరియాలోని బయోమెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ఇలా చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story