ఒక వైపు కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) ప్రపంచాన్ని వణికిస్తుండటంతో జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ వైరస్‌ కారణంగా చికెన్‌ తినడం కూడా మనేశారు. చికెన్‌ తింటే కూడా కరోనా వైరస్‌ వస్తుందనే భయం జనాల్లో నాటుకుపోయింది. కరోనా కారణంగా చికెన్‌ వ్యాపారాలు భారీగా పడిపోయాయి. కాగా, కరోనా వైరస్‌ అటుంచితే ఇప్పుడు కోళ్లకు సోకిన మరో వింత వైరస్‌ అటు వ్యాపారులను, ఇటు జనాలను మరింత భయపెడుతోంది. ఈ వింత వైరస్‌ కారణంగా ఖమ్మం జిల్లాలో సుమారు 30 వేల కోళ్లు మృతి చెందినట్లు తెలుస్తోంది.

దీంతో పౌల్ట్రీ రంగం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకు కోళ్లు మృతి చెందడంతో ఎందుకు చనిపోతున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. లక్షలు ఖర్చు చేసి కోళ్ల ఫారాలను నడిపిస్తుంటే, కోళ్లు ఇలా మృతి చెందడంతో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కాగా, చికెన్‌ తింటే కరోనా వ్యాపిస్తుందని ఆందోళన చెందుతున్న ప్రజలకు.. ఇలా కోళ్లు మృతి చెందడంతో మరింత భయం పట్టుకుంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.