కాలుష్యపు నురగ నిండిన యమునలో భక్తులు ఛత్ పూజ జరుపుకున్నారా?

By సత్య ప్రియ  Published on  4 Nov 2019 11:28 AM GMT
కాలుష్యపు నురగ నిండిన యమునలో భక్తులు ఛత్ పూజ జరుపుకున్నారా?

ఆదివారం, నవంబర్ 3, 2019న ఉత్తర భారత దేశంలో వేలమంది భక్తులు ఛత్ పూజ ను జరుపుకున్నారు. తెల్లవారుజామునే లేచి, నదీ తీరన చేరి సూర్య దేవుని అర్చిస్తారు భక్తులు. నేపాల్ లో, ఉత్తర భారతదేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో భక్తులు ఈ పండుగ ను వైభవంగా జరుపుకుంటారు.

ఢిల్లీ ప్రజలు కూడా ఈ పూజను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సందర్భాన్ని ఆసరాగా తీసుకొని ఢిల్లీ లో యమునా నది ఘాట్ లలో కాలుష్యపు నురుగులో భక్తులు ఛత్ పూజ ను నిర్వర్తిస్తున్నారంటూ కొందరు ట్విట్టర్ లో కొన్ని చిత్రాలు షేర్ చేస్తున్నారు.



నిజ నిర్ధారణ:

ఢిల్లీలో కాలుష్యపు స్థాయి చాలా ఎక్కువగా ఉన్న మాట నిజమే అయినా, ట్విట్టర్ లో పంచుకున్న అన్ని చిత్రాలూ ఈ సంవత్సర ఛత్ పూజ కి చెందినవి కావు. న్యూస్ మీటర్ బృందం వీటిని గూగుల్, యాండెక్స్ వంటి సెర్చ్ ఇంజిన్లలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, 2015 లో తీసిన చిత్రాలు కూడా ఇప్పటివిగా చలామణి అవుతున్నట్టు తెలుస్తోంది.

నవంబర్ 18, 2015 లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ప్రచురించిన కధనం చూడండి:

https://indianexpress.com/article/cities/delhi/thousands-throng-yamuna-ghats-in-delhi-to-offer-prayers-on-chhath/

ట్విట్టర్ లో పంచుకున్న చిత్రాలలో ఒకటి:

Chat Puja 1

ఈ చిత్రాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, అది 2016లోని ఛత్ పుజలోనిది అని తెలుస్తోంది. దానికి సంబంధించిన కధనం:

ఇంకో చిత్రం:

Chat Puja1 2

యాండెక్స్ సెర్చ్ ఇంజిన్ లో వెతికినప్పుడు, ఈ చిత్రం 2018 లో ఎన్నో వార్తా కధనాలలో ప్రచురితం అయినట్టు తెలుస్తోంది.

Chat Puja 2

ఇది ఢిల్లీ లోని కలిదిండి కుంజ్ ఘాట్ లో తీసినట్టు అవగతమవుతోంది.

https://www.outlookindia.com/photos/photoessay/chhath-puja-2018-in-photos/1439?photo-178097

ఇంకో చిత్రానికి పుర్వ కధనాలు దొరకలేదు.

Chat Puja 3

అసలు నదులలో కాలుష్యపు నురగ ఏర్పడడానికి మూల కారణం బట్టలు ఉతికే డిటర్జెంట్ల తయారీ లో వాడే ఫాస్ఫరస్ అని తెలుస్తోంది. బెంగళూరులోని బెల్లందూర్ లేక్ లో కూడా ఇలాంటి నురగ రావడం చూస్తుంటాం. ఈ ఫాస్ఫరస్ యూపి, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్న గనులలో దొరుకుతుందని తెలుస్తోంది.

https://www.indiatoday.in/mail-today/story/delhi-detergent-waste-chokes-yamuna-at-the-mouth-excess-phosphate-behind-deadly-froth-1191452-2018-03-17

యమున లో కాలుష్యపు నురగలు సంభవించడం నిజమే అయినా.. ట్విట్టర్ లో షేర్ చేయబడుతున్న అన్ని చిత్రాలూ ఈ సంవత్సరం ఛత్ పూజ వి కావు.

ఈ చిత్రాలు సుమారుగా ప్రతి సంవత్సరం సోషల్ మీడియాను వేదిక చేసుకొని కొత్తవిగా షేర్ చేయబడుతుంటాయి. దీంతో, సమస్య పెద్దదిగా కనిపిస్తుంది.

ప్రచారం: యమునా నదిలో కాలుష్యపు నురగలో మునిగి భక్తులు ఛత్ పూజలు నిర్వర్తించారు.

ప్రచారం జరుగుతున్నది: ట్విట్టర్ లో

నిజ నిర్ధారణ: పాక్షికంగా తప్పు. చాలా చిత్రాలు పాతవి, కొన్ని 2015 లో తీసినవి కూడా ఉన్నాయి.

Next Story