టీమిండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా గ్లౌసెస్టర్‌షైర్‌తో జతకట్టాడు. ఏప్రిల్‌లో మొదలయ్యే ఇంగ్లీష్‌ కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడేందుకు 32 ఏళ్ల ఈ భారత బ్యాట్స్‌మన్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 12 నుంచి మే 22 వరకు ఆరు మ్యాచులు మాత్రమే ఆడనున్నాడు.  ఈ జట్టుతో ఆడటం తనకెంతో సంతోషంగా ఉందని, కౌంటీ క్రికెట్‌లో గ్లౌసెస్టర్‌షైర్‌కు ఎంతో పేరుందని చెప్పాడు ఈ సౌరాష్ట్ర బ్యాట్స్‌మెన్‌.

పుజారా కౌంటీలాడటం ఇదేం కొత్తకాదు. గతంలో డెర్బీషైర్, యార్క్‌షైర్, నాటింగ్‌హామ్‌షైర్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో పుజారా ఒకడని.. గ్లౌసెస్టర్‌షైర్‌ కోచ్‌ రిచర్డ్ డాసన్‌ అన్నాడు. అతడి రాకతో తమ జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ మరింత పటిష్టంగా మారనుందని చెప్పాడు. 1995లో జవగళ్‌ శ్రీనాథ్ ఆడిన తర్వాత గ్లౌసెస్టర్‌షైర్‌కు ఆడుతున్న తొలి భారత క్రికెటర్‌ పుజారానే కావడం విశేషం.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.