త్రీ ఇడియట్స్ నిర్మాతపై సంచలన ఆరోపణలు చేసిన చేతన్ భగత్

By సుభాష్  Published on  22 July 2020 7:41 AM GMT
త్రీ ఇడియట్స్ నిర్మాతపై సంచలన ఆరోపణలు చేసిన చేతన్ భగత్

బాలీవుడ్ నిర్మాత విధు వినోద్ చోప్రాపై ప్రముఖ రైటర్ చేతన్ భగత్ సంచలన ఆరోపణలు చేశారు. చేతన్ భగత్ రాసిన నవలలను బాలీవుడ్ లో సినిమాలుగా తీసి మంచి హిట్లు సాధించాయి. విధు వినోద్ చోప్రా నిర్మించిన త్రీఇడియట్స్ సినిమాను చేతన్ భగత్ రాసిన 'Five Point Someone' అనే పుస్తకం నుండి తీసుకుని నిర్మించినదే..! కానీ ఈ సినిమా రైటర్ గా తనకు రావాల్సిన పేరు మొత్తం విధు వినోద్ చోప్రా తీసుకున్నాడని.. ఈ ఘటనల వలన తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని చెప్పుకొచ్చాడు. 2009లో 3 ఇడియెట్స్ సినిమా రిలీజ్ సమయంలో తనను తీవ్రంగా వేధించారు. ఆయన వేధింపులకు తట్టుకోలేక ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనేంతగా క్షోభకు గురయ్యాను అని చేతన్ భగత్ ట్వీట్ చేశాడు.

అనుపమ చోప్రాతో ట్విట్టర్ లో జరిగిన చిన్నపాటి వాదన కారణంగా చేతన్ భగత్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన 'దిల్ బేచారా' సినిమా జులై 24న ఈ సినిమాను హాట్ స్టార్ డిస్నీ ఫ్రీగా విడుదల చేస్తుంది. ఈ సినిమా విషయంలో విశ్లేషకులు కాస్త సున్నితంగా రివ్యూలు రాయాలని సూచించారు. 'సుశాంత్ నటించిన చిట్టచివరి చిత్రం త్వరలోనే వస్తుంది. అందుకే గొప్ప గొప్ప సినీ విశ్లేషకులకు ముందే చెప్తున్నా దిల్ బెచారా గురించి రాసేటప్పుడు మీ చేతులు, కలం కాస్త సున్నితంగా రాతలు రాయండి.. చనిపోయిన వ్యక్తి సినిమా గురించి సెన్సిబుల్‌గా, నిజాయితీగా రివ్యూలు రాయండి. చెత్త ట్రిక్కులు ప్లే చేయకండి. ఇప్పటికే చాలా మంది జీవితాలను నాశనం చేశారు. ఇకనైనా వాటిని ఆపండి. మేమంతా గమనిస్తూనే ఉంటామన్నాడు చేతన్ భగత్.

‘విశ్లేషణ తక్కువగా ఉందని మీరు భావించిన ప్రతిసారి ఇదే జరుగుతుంది’ అని విధు వినోద్ చోప్రా భార్య అనుపమ చోప్రా చేతన్ భగత్ ట్వీట్ కు స్పందించారు. చేతన్‌ భగత్‌ ‘మేడమ్‌.. మీ భర్త నన్ను బహిరంగంగా తిట్టారు. బెస్ట్‌ స్టోరి అవార్డులను సిగ్గులేకుండా తీసుకున్నారు. నా కథకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. ఆయన ప్రవర్తనతో నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించారు. మీరు వీటన్నింటిని చూస్తూ ఉన్నారు. మరి మీ విశ్లేషణ ఏది’ అంటూ ప్రశ్నించారు.

భారీ హిట్ అందుకున్న 'త్రీ ఇడియట్స్' చిత్రం ప్రారంభంలో ‘చేతన్‌ భగత్‌ ‘ఫైవ్‌పాయింట్‌ సమ్‌వన్’‌ ఆధారంగా’ అని వేశారు. కానీ టైటిల్స్‌లో కథ, స్క్రీన్‌ప్లే అభిజాత్‌ జోషి అని వేశారు. దీనిపై ఎప్పటి నుండో తన బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాడు చేతన్ భగత్.Next Story