అద్దె గర్భం ద్వారా పుట్టిన చిరుతలు..!

By Newsmeter.Network  Published on  3 March 2020 8:46 AM GMT
అద్దె గర్భం ద్వారా పుట్టిన చిరుతలు..!

సర్రోగసి.. అద్దె గర్భం.. ఇప్పటి వరకూ మనుషుల విషయంలోనే వింటూ వచ్చాం.. ఇప్పుడు జంతువుల విషయంలో కూడా అది సాధ్యమవుతూ ఉంది. తాజాగా అద్దె గర్భం ద్వారా చిరుత రెండు కూనలకు జన్మనిచ్చింది. ఈ అద్భుతం ఓహియో లోని 'కొలంబస్ జూ అండ్ ఎక్వేరియం'లో చోటుచేసుకుంది. చిరుత పులులపై ఇలా ఎంబ్రియో(పిండం) తరలించడం అన్నది జరగడం ఇదే మొదటిసారి. రెండు కూనలకు జన్మనిచ్చింది ఆ ఆడ చిరుత. అంతరించి పోతున్న జంతువుల జాబితాలో చిరుతలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇలా అద్దె గర్భం ద్వారా చిరుతలు జన్మించడం వాటిని కాపాడొచ్చనే ఆశ జంతు ప్రేమికుల్లో కనిపిస్తోంది.

చిరుతలలో జెనెటిక్ డైవర్సిటీ అన్నది అతి తక్కువ అనే చెప్పుకోవచ్చు. ది స్మిత్సోనియన్ కన్వర్సేషన్ బయాలజీ ఇన్స్టిట్యూట్(ఎస్.సి.బి.ఐ.) చిరుతల్లో కృత్రిమ గర్భారాధన కోసం కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. 2003 తర్వాత మొదటిసారి వారు చేసిన ప్రయత్నం ఫలించింది. ఐవీఎఫ్ ప్రయోగం ద్వారా ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. చిరుత కూనలు ఆరోగ్యంగా ఉండడం.. తమ ప్రయోగం ఫలించినందుకు ఎస్.సి.బి.ఐ. అధికారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎస్.సి.బి.ఐ. చిరుతపులులపై ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రయోగం 2005 నుండి చేస్తున్నారు. ఇన్ని రోజుల్లో చిరుతల్లో ఎగ్ ఫిజియోలజీని వారు ముఖ్యంగా గమనిస్తూ వస్తున్నారు. చిరుతల్లో పునరుత్పత్తి లక్షణాలు తక్కువగా ఉన్నప్పటికీ గర్భాధారణకు మాత్రం అనుకూలంగానే ఉన్నట్లు గుర్తించారు. విట్రో ఫెర్టిలైజేషన్ కు అనుకూలంగా ఉండే చిరుతలను సెలెక్ట్ చేసుకుని 2011 నుండి హార్వెస్ట్, ఫెర్టిలైజ్ ద్వారా ఎగ్స్ ను ఎంబ్రియోస్ గా మార్చాలని ప్రయత్నిస్తూ వచ్చారు. చివరికి 2019లో అనుకున్నది సాధించారు.

Cheetah Born Through Surrogacy

కొలంబస్ జూలో ఉన్నటువంటి ఆడ చిరుత కడుపులో పిండం పెరగడాన్ని అల్ట్రా సౌండ్ ద్వారా గమనించారు. ఫిబ్రవరీ 19 న మూడు సంవత్సరాల 'ఇసబెల్లా' అనే చిరుత రెండు కూనలకు జన్మనిచ్చింది. ఆరున్నర సంవత్సరాల 'కిబిబి' అనే చిరుత బయోలాజికల్ తల్లి అని ఎస్.సి.బి.ఐ. అధికారులు స్పష్టం చేశారు. కిబిబి శరీరం సంతానోత్పత్తికి సహకరించకపోవడంతో ఇప్పటివరకూ ఎటువంటి బిడ్డకూ జన్మనివ్వలేకపోయింది. జెనెటికల్ గా కిబిబి అండానికి మంచిగా మ్యాచ్ అయ్యే మగ చిరుత టెక్సాస్ లో దొరికింది. మగ డోనార్ చిరుత టెక్సాస్ లోని 'ఫాజిల్ రిమ్ వైల్డ్ లైఫ్ సెంటర్' లో నివసిస్తున్నప్పటికీ శాస్త్రవేతలు దాని స్పెర్మ్ ను జాగ్రత్తగా కొలంబియాకు చేర్చారు. ఆ తర్వాత వీరు చేసిన ప్రయోగం ఫలించడం.. రెండు కూనలకు జన్మనివ్వడం చకచకా జరిగిపోయాయి. ఆ కూనలు ఆరోగ్యంగా ఉండడం.. శాస్త్రవేత్తలకు అమితానందాన్ని ఇస్తోంది.

Next Story