అక్కినేని వారి కోడ‌లు సమంత.. రెండవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అభిమానుల కోసం కొత్త ఫోటోలు షేర్ చేసింది. సంవత్సరాలు గడిచే కొద్దీ తమ బంధం మరింత బలపడుతోంది అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రేమించుకుని వివాహబంధంతో ఒకటైన సెలబ్రిటీ కపుల్ చై-సామ్. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏం మాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్‌లో జెస్సీగా అడుగుపెట్టిన సమంత.. ఆ సినిమాలో హీరోగా నటించిన అక్కినేని నటవారసుడు నాగచైతన్యతో తొలిచూపులోనే ప్రేమలో పడిపోయింది.

 

సుమారు 7 సంవత్సరాల తర్వాత పెద్దల ఆశీర్వాదంతో ఈ జంట ఒక ఇంటి వారయ్యారు. పెళ్లికి ముందు రెండు సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట పెళ్లి తర్వాత ‘మజిలీ’ లో కలిసి న‌టించారు. సెకండ్ యానివర్సరీ సందర్భంగా పెళ్లినాటి కొన్ని ఫోటోలను సమంత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. వీటితో పాటు సమంత, నాగచైతన్య కలిసి డాన్స్ చేస్తున్న వీడియో ను కూడా పోస్ట్ చేశారు.  సమంత ప్రస్తుతం తెలుగులో శర్వానంద్‌తో ’96’ రీమేక్‌లో నటిస్తుంది. ప్రేమ్ కుమార్ దీనికి దర్శకుడు. నాగచైతన్య కెఎస్. రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ‘వెంకీ మామ’ చిత్రంతోపాటు, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ  చిత్రంలో నటిస్తున్నాడు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.