సైంటిస్ట్‌ సురేష్‌ను చంపింది అనైతిక బంధమే- హైదరాబాద్‌ పోలీసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2019 11:20 AM GMT
సైంటిస్ట్‌ సురేష్‌ను చంపింది అనైతిక బంధమే- హైదరాబాద్‌ పోలీసులు

హైదరాబాద్‌: కొన్ని రోజుల క్రితం ఎస్‌ఆర్‌ నగర్‌లో సైంటిస్ట్ సురేష్ హత్య సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ కేసును పోలీసులు చాలా ప్రెస్టిజ్‌గా తీసుకున్నారు. కేసును వారం కూడా గడవక ముందే పోలీసులు ఛేదించారు. కేసు వివరాల్లోకి వెళ్తే..

ఎస్‌ఆర్‌ నగర్‌లో సైంటిస్ట్ సురేష్‌ కుమార్‌ నివాసముంటున్నారు. హత్య తరువాత సురేష్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సురేష్ హత్య కేసులో శ్రీనివాస్‌పై అనుమానం ఉండి ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. సురేష్ ఫోన్ కాల్స్‌ ద్వారా విచారణ ముందుకు తీసుకెళ్లారు. రామగుండానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అక్రమ సంబంధం, ఆర్ధిక లావాదేవీల వల్లనే హత్య చేసినట్లు పోలీసుల దగ్గర సురేష్‌ ఒప్పుకున్నాడు.

రెండు, మూడు నెలల నుంచి సురేష్, శ్రీనివాస్‌ల మధ్య పరిచయం ఏర్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. బ్లడ్ శాంపిల్స్ ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడినట్లు చెప్పారు. సురేష్ డబ్బులు ఇవ్వడంలేదనే కోపంతోనే శ్రీనివాస్ హత్య చేసినట్లు పోలీసులు ప్రాధమిక విచారణలో బయటపడింది.

నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో మరింత సమాచారం తెలిసే అవకాశముంది. మొత్తానికి అనైతిక బంధమే సైంటిస్ట్ సురేష్ హత్యకు కారణమైందని పోలీసులు తేల్చారు.

Next Story