ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుంటే జనాలు వణికిపోతున్నారు. చైనాలో మొదలైన ఈ వైరస్‌ 60కిపైగా దేశాలకు వ్యాపించింది. ఈ వైరస్‌ కారణంగా 3వేలకుపైగా మరణించారు. ఒక వైపు కరోనా రావడంపై ప్రజలు భయాందోళన చెందుతుంటే.. మరోవైపు వేల సంఖ్యలో మరణించడంపై అయ్యో పాపం అంటున్నారు.

తాజాగా కరోనా వైరస్‌పై నటి ఛార్మి చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక తాజాగా కరోనా వైరస్‌ దేశం రాజధానితో పాటు తెలంగాణలో నమోదు కావడంపై నటి ఛార్మి కరోనా వైరస్‌కు స్వాగతం అంటూ సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారం రేపుతోంది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కరోనా వైరస్‌కు స్వాగతం పలకడానికి ఏదైన మంచి కార్యమా.. లేక శుభకార్యమా అంటూ మండిపడుతున్నారు. అసలు ఛార్మికి మైండ్‌ ఏమైనా దొబ్బిందా అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడటంతో కరోనా వైరస్‌పై ఛార్మి చేసిన టిక్ టాక్ వీడియోను వెంటనే డిలీట్‌ చేసేసింది. ఏదేమైనా కరోనా వైరస్‌పై ఛార్మి పిచ్చి పిచ్చిగా మాట్లాడి అనవసరంగా ఇరుక్కుపోయింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.