ఛార్మి తల్లిదండ్రుల‌కు క‌రోనా పాజిటివ్‌

By సుభాష్  Published on  26 Oct 2020 7:44 AM GMT
ఛార్మి తల్లిదండ్రుల‌కు క‌రోనా పాజిటివ్‌

భార‌త్‌లో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. ఈ మ‌హ‌మ్మారి ఎవ్వ‌రిని వ‌ద‌ల‌డం లేదు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఏదో ర‌కంగా క‌రోనా బారీన ప‌డుతున్నారు. సామాన్యులు, సెల‌బ్రెటీలు అనే తేడాలేకుండా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారీన ప‌డుతున్నారు. సినిమా షూటింగ్స్‌కు అనుమ‌తి ఇచ్చిన‌ప్ప‌టి నుంచి సినీ ప‌రిశ్ర‌మ క‌రోనాతో వ‌ణికిపోతోంది. ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రెటీల‌కు క‌రోనా సోకింది.

ప్రముఖ నటి, నిర్మాత చార్మి తల్లిదండ్రులకు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అభిమానుల‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు చెబుతూనే ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. లాక్‌డౌన్ నుంచి తన పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకున్నారని, కానీ ఇటీవల హైదరాబాద్లో పోటెత్తిన వరదల కారణంగా వారు కరోనా వైరస్ బారినపడ్డట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం తెలిసి తానెంతో బాధపడినట్లు వెల్లడించింది.

అక్టోబర్ 22న తన తల్లిదండ్రులకు కొవిడ్ పాజిటివ్గా తేలినట్లు చార్మి పేర్కొంది. ప్రస్తుతం వారు ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. తన తల్లిదండ్రులను త్వరలోనే ఆనందంగా, ఆరోగ్యంగా చూడాలనుకుంటున్నట్లు చెప్పింది. ఎవరైనా సరే సింటమ్స్ కనిపిస్తే వెంటనే టెస్టులు చేయించుకోవాలని, పాజిటివ్ వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని చార్మీ నెటిజన్లను కోరింది.

Charmi Parents Tested Covid Positive 1

Next Story