అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైద్రాబాద్ యువతి బ్రెయిన్ డెడ్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Dec 2019 10:12 PM IST
అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఆ యువతి బ్రెయిన్ డెడ్ అయింది. మిచిగాన్‌లో నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చరితా రెడ్డి (26) టయోటా కామ్రీ కారులో ప్రయాణిస్తుండగా.. వెనుక నుండి వేరే కారులో వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యక్తి బలంగా కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చరితారెడ్డి కోమలోకి వెళ్లింది. అనంతరం చరితారెడ్డి బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయినట్లు సమాచారం.
గాయపడిన క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి మద్యం సేవించి కారు నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చరితా రెడ్డి బ్రెయిన్ డెడ్ అయిన విషయం తెలిసిన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.