విక్రమ్ ల్యాండర్ జాడ కనుగొన్న నాసా..!

By అంజి
Published on : 3 Dec 2019 9:42 AM IST

విక్రమ్ ల్యాండర్ జాడ కనుగొన్న నాసా..!

చంద్రుడి దక్షిణ ధృవంలో కోల్పోయిన విక్రమ్ లాండర్ జాడను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కనిపెట్టింది. నాసాకు చెందిన లూనార్ రీకానైసాన్స్ ఆర్బిటర్ చంద్రుని ఉపరితలంపై ప్రభావితమైన ప్రదేశాలను స్పష్టంగా గుర్తించింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 లో భాగంగా విక్రమ్ ల్యాండర్ ను చంద్రుడిపైకి పంపితే అది కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలోఇన్నాళ్లు చీకటి గా ఉండటం వల్ల ల్యాండర్ జాడను కనిపెట్ట లేక పోయారు. అయితే ఇప్పుడు ఎల్ ఆర్ వో చంద్రుడి ఉపరితలంపై ప్రభావితమైన ప్రదేశాలను స్పష్టంగా ఫోటో తీసి పంపింది. విక్రమ్ శకలాలు దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న రెండు డజన్ల ప్రదేశాలలో పడ్డట్టు గుర్తించింది. షణ్ముగ సుబ్రమణియన్ అనే వ్యక్తి విక్రమ్ కు సంబంధించిన తొలి శకలాన్ని కనుగొన్నట్లు నాసా ప్రకటించింది.

Vikram Impact Ratio 1100

విక్రమ్ కూలిన ప్రదేశానికి వాయువ్యదిశలో 750 మీటర్ల దూరంలో శకలాన్ని మొదటగా గుర్తించినట్లుగా పేర్కొంది. అనంతరం ఎల్ ఆర్ వో ప్రాజెక్టు బృందం ఇతర శకలాలు గుర్తించినట్లు నాసా పేర్కొంది. అక్టోబర్ 14, 15 నవంబరు 11న ఈ చిత్రాలు తీసినట్లుగా ధృవీరించింది. విక్రమ్మ్ శకలాలు పడటానికి ముందు, పడిన తర్వాత చంద్రుని ఉపరితలం ఎలా ఉందో కూడా నాసా విడుదల చేసింది. సెప్టెంబరు 7న చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన చంద్రయాన్-2లోని విక్రమ్ లాండర్ చివరి క్షణంలో సంబంధాలు కోల్పోయింది. అప్పటినుంచి విక్రం జాడని కనుక్కునేందుకు ఇస్రో తో పాటు నాసా కూడా అనేక ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు విక్రమ్ చివరి క్షణంలో అంచనాలను తారుమారు చేయడానికి సాఫ్ట్వేర్ సమస్యే కారణమని ఇస్రో ప్రకటించింది.



Next Story