చంద్రబాబుకు సవాల్ విసిరిన మంత్రి కన్నబాబు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2019 7:21 AM GMT
చంద్రబాబుకు సవాల్ విసిరిన మంత్రి కన్నబాబు

తూర్పుగోదావరి జిల్లా: సంక్షేమం, అభివృధ్ధి రెండు కళ్లుగా జగన్ పరిపాలిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీస్తున్నారని చెప్పారు. అది భరించలేకే చంద్రబాబు ఫ్రస్టేషన్‌తో..అన్ని పచ్చి అబధ్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు.చంద్రబాబును చూసి వైఎస్ఆర్ భయపడడమేంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే ఆయనకు పిచ్చినట్లుందని ఎద్దేవాచేశారు.

రాష్ట్రంలో 50శాతం ఓట్లు సాధించి జగన్ సీఎం అయ్యారు. ఆయనను నోటికి వచ్చినట్టు అనడం తప్పని తెలియదా..? అని కన్నబాబు ప్రశ్నించారు. 40 ఏళ్ల అనుభవంలోని హుందాతనాన్ని కాపాడుకోవడం చంద్రబాబుకు తెలియదన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారాలంటే రాజీనామా చేయాలనే.. నిబంధన పెట్టకపోతే మీ వాళ్లు ఎంత మంది ఉంటారో అందరికి తెలుసంటూ ఎద్దేవా చేశారు. మద్యం ధరల పెరిగాయంటున్నారు మీకేమైనా పిచ్చి పట్టిందా!.. అదేమైనా నిత్యావసర వస్తువా.? అంటూ మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు నిర్వహిస్తున్నారని ఆరోపించడం మానుకోవాలన్నారు. మేము వస్తాం మీరు రండి ఎక్కడో చూపించండి అంటూ మంత్రి కన్నబాబు సవాల్‌ విసిరారు. మీ బలం పెంచకునే ప్రయత్నం చేయండి. కానీ జగన్ మీద బురదజల్లితే.. ఆది మీ మీదే పడుతుందనే విషయం గుర్తుపెట్టుకోవడం మంచివంటూచంద్రబాబుకు కన్నబాబు సలహా ఇచ్చారు.

Next Story
Share it