ఆమె ప్రశ్నలకు జగన్‌ సర్కార్‌ ఏం సమాధానం చెబుతుంది..?: చంద్రబాబు

By సుభాష్  Published on  4 March 2020 3:03 PM GMT
ఆమె ప్రశ్నలకు జగన్‌ సర్కార్‌ ఏం సమాధానం చెబుతుంది..?: చంద్రబాబు

ఏపీ రాజధాని ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పెద్ద మోసమని ఓ మహిళ చేసిన వ్యాఖ్యలను ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. టీడీపీ హయాంలో కట్టించి సిద్ధం చేసిన ఇళ్లను పేదలకు ఎందుకు ఇవ్వరని, ఆ ఇళ్ల కోసం మేం కట్టిన డబ్బు సంగతేంటి.. మాకు ఇచ్చిన బాండ్లకు ఈ ప్రభుత్వం జవాబుదారీ కాదా..? మాకిచ్చిన ప్లాట్లు వేరే వాళ్లకు ఎలా ఇస్తారని ఓ నిరుపేద మహిళ ప్రభుత్వాన్నిప్రశ్నించిన వీడియోను చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఇప్పటికే ప్లాట్ల కోసం కట్టిన డబ్బుకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని, మరో వైపు ఇంటి అద్దెలు చెల్లించలేక నానా ఇబ్బందులకు గురవుతున్నారని, ఆ మహిళకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని చంద్రబాబు మండిపడ్డారు. పేదల పట్ల వైసీపీ ప్రభుత్వం దిగజారుడుతనానికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. మహిళలకు న్యాయం చేస్తామని చెప్పి మోసం చేస్తోందని ఆరోపించారు. తమ హయాంలోనే మహిళలకు సరైన న్యాయం జరిగిందని, ఇప్పుడు ప్రభుత్వం వల్ల మహిళలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.Next Story
Share it