వాలంటీర్ల పేరుతో భర్తలు ఇంట్లోలేనప్పుడు తలుపులు కొడతారా..?!- చంద్రబాబు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Sep 2019 9:38 AM GMT
వాలంటీర్ల పేరుతో భర్తలు ఇంట్లోలేనప్పుడు తలుపులు కొడతారా..?!- చంద్రబాబు

గుంటూరు: విద్యుత్ కొనుగోళ్లలో టీడీపీ ప్రభుత్వం పెద్దఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించి..అభాసుపాలయ్యారని చంద్రబాబు అన్నారు. ఆనాడు రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా విద్యుత్ సరఫరాలో రాజీపడలేదన్నారు. ఎప్పుడూ కరెంట్ ఛార్జీలు పెంచలేదన్నారు. టెక్నాలజీతో సోలార్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. దీర్ఘకాలంలో పునరుత్పాదక విద్యుత్తే శ్రేయస్సుకరమని కేంద్రమంత్రి కూడా లేఖలో చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. కోర్టు చెప్పినా, కేంద్రం చెప్పినా వైఎస్ఆర్‌ సీపీ ప్రభుత్వం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుందంటూ మండిపడ్డారు. ప్రధాని కార్యాలయానికి తప్పుడు సమాచారం ఇచ్చే అధికారం..అధికారులకు ఎవరిచ్చారని ప్రతిపక్ష నేత ప్రశ్నించారు. ప్రభుత్వం చేసే తప్పులకు అధికారులు బలి పశువులు కావొద్దన్నారు చంద్రబాబు.

టీడీపీ హయాంలో ఇసుక ధర ఎంతో..ఇప్పడెంతో సమాధానం చెప్పాలన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. రివర్స్‌ టెండరింగ్‌లో రూ.750 కోట్లు లాభం అని చెప్పి..రూ.7,500 కోట్లు నష్టం చేకూరుస్తున్నారన్నారు. వాలంటీర్ల పేరుతో భర్తలు ఇంట్లో లేనప్పుడు వెళ్లి తలుపులు కొడతారా అంటూ చంద్రబాబు ఘాటు, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నెలకు రూ. 5వేలు జీతం ఇచ్చి వాలంటీర్లను పెడతారా అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోమన్నారు చంద్రబాబు నాయుడు.

Next Story