రైతులను ఆదుకోవాలి : ఏపీ సీఎస్ కు చంద్రబాబు లేఖ

By రాణి  Published on  22 April 2020 4:02 PM GMT
రైతులను ఆదుకోవాలి : ఏపీ సీఎస్ కు చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు పండించే పంటలకు కనీస గిట్టుబాటు ధరలిచ్చి ఆదుకోవాల్సిందిగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన రాసిన లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Also Read : ఈ డోర్ తెరవండి ప్లీజ్..కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

'' లాక్ డౌన్ కారణంగా చేతికొచ్చిన పంటను అమ్ముకోలేక రబీ, ఉద్యాన రైతులు, ఉత్పత్తిని అమ్ముకోలేక ఆక్వా సాగుదారులు కష్టాలు పడుతున్నారు. విరక్తితో కొందరు చేజేతులా పంటను నాశనం చేసుకుంటుంటే, మరి కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి కనీస మద్దతుధరకు ఉత్పత్తులు కొని ఆదుకోవలసిందిగా కోరుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాసాను. అదేవిధంగా ఏయే ప్రాంతాలలో ఏ పంట ఎంత పండిందీ, ప్రభుత్వం గత 2 నెలల్లో ఎంత కొనుగోలు చేసిందీ, మండల, జిల్లా స్థాయి నివేదికలను ప్రజల ముందు ఉంచమని ప్రధాన కార్యదర్శిని కోరడం జరిగింది.'' అని చంద్రబాబు పేర్కొన్నారు.Next Story
Share it