ఈ డోర్ తెరవండి ప్లీజ్..కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

By రాణి  Published on  22 April 2020 3:48 PM GMT
ఈ డోర్ తెరవండి ప్లీజ్..కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

హైదరాబాద్ మీర్ పేట్ పీఎస్ పరిధిలో గల అల్మాస్ గూడలో విషాద ఘటన చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. తల్లికి అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చనిపోతున్నామంటూ ఆ నలుగురూ రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read : అలా చేయొద్దని డాక్టర్ చెప్పినా నా భర్త వినలేదు : స్వాతి నాయుడు

ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబ సభ్యులంతా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా థరూర్ మండల్ దోర్నాకల్ గ్రామంలో సువర్ణబాయ్, కొడుకులు హరీష్, గిరీష్, కూతురు స్వప్న బలవన్మరణానికి ఒడిగట్టారు. ఇంటికి వెలుపల ఉన్న పైప్ కు ఈ డోర్ తెరవండి ప్లీజ్ అని ఒక బోర్డు తగిలించి ఉండటంతో చుట్టుపక్కల వారు గమనించి తలుపు తెరిచి చూడగా నలుగురూ ముగ్గురు విగత జీవులై, మరొకరు ఉరికి వేలాడుతూకనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా వారు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు రాసిన సూసైడ్ నోట్ ప్రకారం వీరంతా అల్మాస్ గూడ బీఎస్ఆర్ కాలనీకి చెందినవారుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు.

Also Read :ఉద్వేగానికి గురైన మాటల మాంత్రికుడు

Next Story
Share it