యువ హీరో నితిన్ వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఛ‌లో డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ‘భీష్మ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని సితార ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాతో పాటు తొలిప్రేమ‌, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాల ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరితో ‘రంగ్ దే’ అనే సినిమా చేస్తున్నాడు.

Image result for nithin bheeshma

ఈ రెండు సినిమాల‌తో పాటు వైవిధ్య‌మైన చిత్రాల తెర‌కెక్కించే చంద్ర‌శేఖ‌ర్ యేలేటితో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘చద‌రంగం’ అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు సమాచారం. ‘చద‌రంగం’ అనేది చాలా ఓల్డ్ టైటిల్. అయిన‌ప్ప‌టికీ ఈ టైటిల్ పెట్టడానికి కార‌ణం ఏంటంటే… ఈ సినిమాలో ‘చదరంగం’ ఆటకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. అందుకనే ఈ టైటిల్ పెట్టాలి అనుకుంటున్నార‌ని తెలిసింది.

Image result for chandrasekhar yeleti

చంద్ర‌శేఖ‌ర్ యేలేటి సినిమాల్లో మిస్టరీ, సస్పెన్స్ ఉంటుంది. ఈ సినిమాలో మిస్ట‌రీ, స‌స్పెన్స్ ఉంటుంద‌. ప్ర‌తి సీన్ చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంటూ… నెక్ట్స్ సీన్ లో ఏం జ‌రుగుతుందో అని ఉత్కంఠ‌తో చూసేలా ఈ సినిమా ఉంటుంద‌ట‌. నితిన్ స‌ర‌స‌న‌ రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ న‌టిస్తున్నారు. మ‌రి… చంద్ర‌శేఖ‌ర్ యేలేటికి ఈ సినిమా అయినా ఆశించిన విజ‌యాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.