లాక్ డౌన్ డేస్..ఈ సెలబ్రిటీలు ఏం చేస్తున్నారో చూడండి
By రాణి Published on 3 April 2020 2:04 PM GMTకరోనా పుణ్యమా అని..సగం ప్రపంచమంతా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. దీంతో సినిమా, సీరియల్, రియాలిటీ షోలు, కామెడీ షోలు తదితర షూటింగ్ లన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరి ఈ లాక్ డౌన్ డేస్ లో టాలీవుడ్, బాలీవుడ్, బుల్లితెర సెలబ్రిటీలు ఏం చేస్తున్నారో మీకు తెలుసుకోవాలనుందా..అయితే ఇంకెందుకు లేటు.. మీరూ ఓ లుక్కేసేయండి.
బుల్లితెర రాములమ్మ..అదేనండి మన నిజామాబాద్ పోరి..బిగ్ బాస్ 3 రన్నర్, యాంకర్ శ్రీముఖి లాక్ డౌన్ రోజుల్లో ఏం చేస్తుందో తెలుసా ? వంటింట్లోకి దూరి తన చేతికి పనిచెప్పింది. నోరూరించే చికెన్ బిర్యానీ రెసిపీ ని తన అభిమానుల కోసం చేసి చూపించింది.
ఇక మిల్క్ బ్యూటీ తమన్నా అయితే తన బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడంలో యమ బిజీ అయిపోయింది. చాలా సీరియస్ గా బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకుంటుంది చూడండి.
బాలీవుడ్ బ్యూటీ కంగనా అయితే బుద్ధిమంతురాలిగా..ఎంచక్కా తల్లిచేత తన జుట్టుకు నూనె పెట్టించుకుని జడ వేయించుకుంది.
అమ్మాయిల కలల రాజకుమారుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే తన సితార పాపతో టైం గడిపేస్తున్నారు. సితారపాపతో అలా సమయాన్ని గడుపుతున్నపుడు తీసిన ఫొటోను ఇన్ స్టా లో షేర్ చేశారు.
నటి ప్రగ్యా జైశ్వాల్ కొవ్వును కరిగించుకునే పనిలో పడింది. ఇంట్లోనే వర్కవుట్స్ చేస్తూ లాక్ డౌన్ డేస్ ను గడిపేస్తోంది. రోజును ఆనందంగా ప్రారంభించడానికి ఇదొక ఆనందమైన దారి అని ఇన్ స్టాలో రాసింది.
శాన్వి శ్రీ. ఈ మధ్యకాలంలో తెలుగులో ఏ సినిమాలు చేయలేదు కానీ..ఇతర భాషల్లో అడపా దడపా సినిమాలు చేస్తుంది. ఖాళీ సమయంలో తనలో ఉన్న టాలెంట్ ను బయటపెట్టింది. పెయింటింగ్ వేసి శాన్విలో ఇంత టాలెంట్ ఉందా అని నెటిజన్లు ఆశ్చర్యపోయేలా చేసింది.
బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రెజా స్వయంగా వంట చేసి..లాక్ డౌన్ వల్ల తిండి లేక ఆకలితో అలమటిస్తున్నవారికి తిండి పెట్టి రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.
తాప్సీ అయితే తన రింగు రింగుల జుట్టును స్ట్రైట్ గా చేసుకునే పనిలో పడింది. ఇదిగో నేను నా జుట్టుపై ప్రయోగాలు చేస్తున్నాను. మొత్తానికి నా జుట్టు స్ట్రైట్ అయింది. కానీ అది ఎలా అన్నది ఎవరూ ఊహించలేరంటూ ఇన్ స్టా లో పోస్ట్ చేసింది.
సింగర్ శ్రేయా ఘోషల్ ఈ రోజు టిక్ టాక్ లైవ్ లోకి వస్తున్నానంటూ ఇన్ స్టాలో చెప్పింది. ఈ లైవ్ చాట్ లో తనను ఏమడిగినా సమాధానమిస్తానని తెలిపింది.