జనాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసే పూర్తిగా దిగజారిపోతున్నాడు. పోలీసంటేనే సమాజంలో ఎంతో గౌరవం ఉంటుంది. అలాంటి వృత్తిలో ఉన్న కొందరు పోలీసులు నీచులుగా తయారవుతున్నారు. ఓ పోలీసే ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అసోం రాష్ట్రంలోని కర్బీ అంగ్‌లాంగ్‌ పట్టణంలో జరిగిన ఈ దారుణం తీవ్ర సంచలనంగా మారింది. పట్టణ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న గౌరవ్‌ ఉపాధ్యాయ్‌ ఓ బాలికపై లైంగిక దాడికి దిగాడు. బాలిక ఫిర్యాదు మేరకు ఎస్పీపై పోస్కో చట్టం సెక్షన్‌ 10 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ ఎంపీ గుప్తా తెలిపారు. ఈయన 2012 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి.. 2019 జనవరి 22న కర్బీఅంగ్‌లాంగ్‌ జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. బాలిక ఓ సీనియర్‌ మహిళా పోలీసు అధికారి కుమార్తె అని తెలుస్తోంది.

ఒక విలువైన వృత్తిలో ఉన్న ఈ పోలీసు బాసే ఇలాంటి దారుణానికి ఒడిగట్టడంపై రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడుకుతోంది. తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఒక జిల్లా ఎస్పీ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడటం సమాజానికే సిగ్గుచేటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఎస్పీని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సమాజానికి రక్షణ ఉండాల్సిన పోలీసు అధికారే ఇలాంటి దారుణానికి పాల్పడితే కాపాడేవారు ఎవరుంటారని ప్రశ్నిస్తున్నారు.

సుభాష్

.

Next Story