హైదరాబాద్‌: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్‌ రాజిరెడ్డిలపై అంబర్‌ పేట పోలీస్‌స్టేషన్‌ కేసు నమోదు అయ్యింది. అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలపై మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు దీపక్‌ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 23 మంది ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలే కారణమని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు దీపక్ కుమార్‌ తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వాయిదా వేసుకోవడం వల్ల ఆర్టీసీ జేఏసీ పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తోందని దీపక్‌ కుమార్‌ ఆరోపించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.