గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వంశీపై కేసు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 2:45 PM GMT
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వంశీపై కేసు

కృష్ణాజిల్లా : గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించి నకిలీ ఇళ్లపట్టాలు పంపిణీ చేశారని పోలీసులు నిర్ధారించారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీలో ఎమ్మెల్యే వంశీ ప్రమేయం ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. బాపులపాడు తహశీల్దార్ ఫిర్యాదుతో ఎమ్మెల్యే వంశీ తోపాటు, మరో 9 మందిపై హనుమాన్ జంక్షన్ పీఎస్ లో పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story
Share it