పీవీపీపై కేసు నమోదు చేసిన బంజారహిల్స్ పోలీసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jun 2020 8:50 AM GMT
పీవీపీపై కేసు నమోదు చేసిన బంజారహిల్స్ పోలీసులు

వైఎస్‌ఆర్‌సీపీ నేత, ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వర ప్రసాద్‌ పై బంజార హిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు వివరాల్లోకి వెళ్తే, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ప్రేమ్ పర్వత్ విల్లాస్ పేరిట పీవీపీ నిర్మాణాలు చేపట్టారు. ఇందులో ఓ విల్లాను నాలుగు నెలల క్రితం కైలాస్ విక్రమ్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. విల్లాను మరింత ఆధునీకరించేందుకు విక్రమ్‌ పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న పీవీపీ తన అనుచరులతో కలసి అక్కడకు వెళ్లారు. నిర్మాణ సామగ్రిని దించుతున్న వారిని అడ్డుకున్నారు.

Next Story
Share it