మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీఏ పి. మనోహర్ పై కేసు నమోదైంది. వైసీపీ నేత విద్యాసాగర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు మనోహర్ పై ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కుప్పంలోని కోపరేటివ్ టౌన్ బ్యాంకులో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయం ఫిక్సిడ్ డిపాజిట్లకు సంబంధించి తన సంతకాలను ఫోర్జరీ చేసి మనోహర్ రుణం తీసుకున్నారని విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు. విద్యాసాగర్ చేసిన ఫిర్యాదులో ఎంతవరకూ నిజముందో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Also Read : రిషి కపూర్ పై ప్రధాని ప్రశంసలు..కుప్పకూలిన అమితాబ్

ఇప్పటికే ఏపీలో కరోనా నిర్థారణ పరీక్షలు, జాగ్రత్తలపై అధికార - ప్రతిపక్ష పార్టీల మధ్య కనిపించని యుద్ధమే జరుగుతోంది. ట్విట్టర్ లో విజయసాయి నారా కుటుంబం పై, టిడిపీ నేతలపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కూడా మీకు రాజకీయాలు, స్థానిక సంస్థల ఎన్నికలే ముఖ్యమా అంటూ పెదవి విరుపులు కనిపిస్తున్నాయి.

Also Read :తిరుమలలో శ్రీవారి తిరునామంతో గోవు

రాణి యార్లగడ్డ

Next Story